Kinshuk Shastri Vrutantam Kathalu in Telugu : In this article read "కింశుక శాస్తి వృత్తాంతము తెలుగు కథ", "Kasi Majili Stories in Telugu" for kids.
Kinshuk Shastri Vrutantam Kathalu in Telugu Language : In this article read "కింశుక శాస్తి వృత్తాంతము తెలుగు కథ", "Kasi Majili Stories in Telugu" for kids and Students.
కింశుక శాస్తి వృత్తాంతము తెలుగు కథ
సింహగర్జనకు భయపడిన గుర్రం పరుగులంకించుకొంది. ఆ తొత్తరబాటు లో కింశుకశాస్త్రి గుర్రం మీద నుండి క్రిందపడ్డాడు. విశాలాక్షి గుర్రాన్నదుపు చేయలేక పోయింది. ఒకయోజనదూరంవరకు పోయి నెమ్మదిగా అగింది. అప్పటికే క్రింద పడిన కింశుకశాస్త్రి పడుతూ,లేస్తూ ముక్కుతూ, మూలుగుతూ, అడుగులో అడుగులు వేసుకుంటూ నెమ్మదిగా నడుస్తున్నాడు. కళ్ళు బైర్లు క్రమ్ముతున్నాయి, దాహంతో నాలుక పిడచకట్టుకుపోతూ ఉంది. కొంత దూరం పోయి దాహం, దాహం అంటూ సొమ్మసిల్లిపడిపోయాడు.
ఇంతలో ఆ ప్రాంతపురాజైన మదనుడు సింహగర్జనవిని అటుగా రాసాగాడు ఆ రాజు సింహాన్నెట్లాగైనా చంపి ప్రజలను రక్షించాలనే కృతనిశ్చయంతో పది దినములనుండి అక్కడే బసచేసి ఉన్నాడు. వేటకైవస్తున్న ఆ రాజు క్రిందపడి మూలుగుతూ ఉన్న కింశుకశాస్త్రిని చూసాడు. ఆతని పరిస్థితి మిక్కిలి జాలినొంది. తన వద్దనున్న మంచినీటిని కింశుకశాస్త్రి నోటిలోపోస్తూ ఆతనిముఖాన్ని జూసి ఒక్కసారిగా ఆశ్చర్యపడ్డాడు. ఏమిది! ఈతడు అచ్చం తనలాగే ఉన్నాడే! లోకంలో ఒకే పోలికతో ఏడుగురుంటారంటారు. నిజమేనేమో ! వేషభాషలలో తేడాలుండ పచ్చునేమోగాని, ఈతడు అచ్చుపోసినట్లు తనలాగే ఉన్నాడే ? అనుకుంటూ ఆతని దాహంతీర్చి “అయ్యా ! తమరెవరు ? మిమ్మల్ని చూస్తుంటే మీరొక పండితోత్తములు వలె నున్నారే ! మీ కభ్యంతరంలేనిచో మీరొకమారు మా రాజసభకొచ్చి మీ పాండిత్యంతో మమ్మల్ని ఆనందింపచేయండి”. అని కోరాడు. కింశుక శాస్త్రి చిరునవ్వు నవ్వి, మౌనగా ఉండిపోయాడు. మౌనమే అంగీకారమనుకున్న రాజు కింశుకశాస్త్రిని తన అశ్వం పైనెక్కించుకొని తన శిభిరంవైపు పరుగుతీయించాడు. ..
ఇంతలో మరోసారి సింహగర్జన వినబడేసరికి రాజు అశ్వాన్ని ఆ దిక్కుగా పోనిచ్చాడు. వారుపోయిపోయి ఒక నిర్జన ప్రదేశాన్ని చేరుకున్నారు. చుట్టూదట్టమైన పొదలుచెట్లు ఎటుచూసినాకీకారణ్యమే ! ఎదురుగా పొదలలోనుండిరెండు కాంతి రేఖలు ప్రసరిస్తున్నాయి. ఆ ఎదురుగా నున్నదే సింహం! ఆ కాంతి పుంజాలే సింహపు కండ్లు ! రాజు బాణం సంధించేలోపు ఒక్కసారిగా ఆ సింహంవారిపై దుమికింది. రాజును పట్టుకొని గిరగిరాత్రిప్పి నేలనేసికొట్టింది. తన పంజాతో రాజును నుజ్జు నుజ్జుచేయసాగింది. ఇదంతా చూస్తున్న కింశుకశాస్త్రి గజగజవణికిపోయాడు. ఏం చేయటానికి పాలుపోక, చావు ధైర్యం తెచ్చుకొని రాజు మొలలో ఉన్న కత్తిని తీసుకొని కళ్ళుమూసుకొని ఇష్టం వచ్చినట్లు సింహాన్ని పొడిచిపారేసాడు. ఆ కంగారులో ఒకటి రెండుపోట్లు రాజుగారికి తగిలాయేమో తెలియదుకాని రాజుగారు అపస్మారక స్థితిలోనికి వెళ్ళిపోయారు. సింహమేమో సంహరించబడింది. రాజుగారేమో ప్రాణా పాయ స్థితిలో ఉన్నారు. కింశుకశాస్త్రికి దిక్కుతోచకబిగ్గరగా రోధించసాగాడు.
ఆ రోధన ధ్వనికి పరుగు పరుగున రాజభటులు వచ్చారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రాజుగారిని బ్రతికించటానికి రాజవైధ్యుడుశతవిధాలా ప్రయత్నించాడు. ఫలితం శూన్యం. రాజవైద్యుడు, మంత్రులు, తదితర ముఖ్యులంతా ఏకమై పరిస్థితిని సమీక్షించారు. రాజుగారి మరణవార్త తెలిస్తే రాజ్యం అల్లకల్లోలమవటం ఖాయం అనుకున్నారు. వెంటనే ఒక నిర్ణయానికి వచ్చి కింశుక శాస్త్రికి రాజుగారి వేషం వేయించారు. రాజుగారు బ్రతికినట్లుగా ప్రజలందర్ని నమ్మించారు. కింశుకశాస్త్రి మాత్రం అర్ధాంతరంగా చనిపోయాడని ప్రకటించారు. ఆ విధంగా కింశుకశాస్త్రి మదనమహారజయ్యాడు.
మదన మహారాజు రూపంలోనున్న కింశుకశాస్త్రికి తన విశాలాక్షి ఏమైందో? ఎక్కడుందో? నన్న ఆరాటం ఎక్కువైంది. నిత్యము విశాలాక్షిగురించే చింతించే వాడు. మరికొన్ని దినములు గడిచాయి. కింశుకశాస్త్రి ఇప్పుడు అన్ని విద్యలలోను ఆరితేరిన దిట్ట అయ్యాడు. గుర్రపుస్వారీ, విలువిద్య,మల్లయుద్ధం, ఖడ్గవిద్యలలో ప్రావీణ్యం సంపాదించాడు.
ఒకనాటి రాత్రి తన ఆప్తమిత్రులతో రహస్యసమావేశం జరిపి ఆ మరునాడు ఎవరికీ తెలియకుండా దేశాటనకు బయలుదేరాడు. అలా దేశదేశాలు తిరుగుతూ తన విశాలాక్షికోసం పడరానిపాట్లు పడుతూ చివరకు పురుషవేషంలోనున్న విశాలాక్షివద్దకు చేరుకున్నాడు. మదనుడే కింశుకశాస్త్రి అని గ్రహించిన విశాలాక్షి ఆతన్ని వసంతతిలకకు కూడా పరిచయం చేసింది. మదనుడు తన ఇద్దరి భార్యలతో మన్మధ సామ్రాజ్యాన్నేలుతూ సుఖంగా జీవించసాగాడు.
COMMENTS